పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలు చేర్పించాలి హెడ్మాస్టర్ పాగుంట

Jun 9, 2026 - 15:04
Jun 9, 2026 - 16:24
 0  4
పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలు చేర్పించాలి హెడ్మాస్టర్ పాగుంట
పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలు చేర్పించాలి హెడ్మాస్టర్ పాగుంట

జోగులాంబ గద్వాల 9జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల . మండల కేంద్రంలో బడిబాట లో భాగంగా ఉదయం7 గంటలకు ఇటిక్యాల గ్రామంలోని జడ్పీ పి హెచ్ హై స్కూల్ హెడ్మాస్టర్ ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటా తిరుగుతూ విద్యార్థులు తల్లిదండ్రులకు గవర్నమెంట్ స్కూల్ కి తమ పిల్లలను పంపించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది.  సందర్భంగా హెడ్మాస్టర్ పా గుంట మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థులందరికీ ఉచితం పాఠ్యపుస్తకాలు రెండో జతల యూనిఫామ్స్ తో పాటు మధ్యాహ్నం భోజనాన్ని వారానికి మూడు గుడ్లు మరియు రాగిజావ తో పాటు అల్పాహారం కూడా అందిస్తున్నందున పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. నాణ్యమైన విద్య కొరకు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని బడిబాట కార్యక్రమంలో తల్లిదండ్రులకు పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State