గ్రామపాఠశాల అభివృద్ధి కోసం దాతల సహకారం

Aug 5, 2026 - 00:42
Aug 5, 2026 - 00:43
 0  1
గ్రామపాఠశాల అభివృద్ధి కోసం దాతల సహకారం

అడ్డగూడూరు 4 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– మండల పరిధిలోని  కోటమర్తి గ్రామ పాఠశాల వాలంటీర్ కు అందించే నెల నెల చేసే దాతల సేవలు మరువలేనిదని సర్పంచ్ పాశం విష్ణువర్ధన్ అన్నారు.సోమవారం మండల పరిధిలోని కోటమర్తి ప్రాథమిక పాఠశాలలో గ్రామంలోని దాతల సహకారంతో విద్యా వాలంటీర్ కు ప్రతి నెల వేతనం అందజేస్తున్నమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాఠశాల అభివృద్ధిలో దాతల సహకారం మరువలేనిదని కొని యాడారు. పూర్వ విద్యార్థులు,దాతలు ఇంకా ముందుకు వచ్చి సహకరించినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్, విద్యార్థులు తదితరులు ఉన్నారు.