గోవిందపురం విన్సెంట్ పల్లోటి స్కూల్ లో పదవ వార్షికోత్సవం

చీఫ్ గెస్ట్ కరణం దామన్ కుమార్

Feb 7, 2025 - 22:59
Feb 8, 2025 - 09:27
 0  233

అడ్డగూడూరు 07 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గోవిందాపురం గ్రామంలో సెంట్ విన్సెంట్ పల్లోటి మిషనరీ స్కూల్లో శుక్రవారం రోజు 10వ వార్షికోత్సవ సమావేశం నిర్వహించారు.దీనికి ముఖ్య అతిథిగా రేవా కరణం దామన్ కుమార్ చీప్ గెస్ట్ గా పాల్గొనడం జరిగింది.సాధారణ విద్యార్థులతో అసాధారణమైన ఫలితాలను సాధిస్తూ మండలంలో ఎన్నో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నటువంటి విన్సెంట్ పల్లోటి స్కూలు పేద విద్యార్థులకు అండగా ఉంటుందని ఆయన అన్నారు.అదేవిధంగా అడ్డగూడూరు మండలం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మండలంగా ఉన్నది. కావున చుట్టు పక్కల ఉన్న గ్రామాల ప్రజల విద్యావ్యవస్థలో మార్పును కోరుకునేవారు నూతన వరవడికి శ్రీకారం చుడుతున్నటువంటి సెంటు పల్లోడి స్కూల్లో విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించి తమ పిల్లలను విద్యార్థులుగా రాబోయే తరాల్లో ఉద్యోగులుగా చూడాలనుకుంటున్నారు అదేవిధంగా మేము కొనసాగిస్తున్నామని పేద విద్యార్థులకు సాధ్యమైనంత వరకు ఉచిత విద్యను కూడా అందిస్తున్నామని ఆయన తెలియజేశారు.

.ఇట్టి కార్యక్రమంలో విద్యార్థుల ఆటపాటలను వారు మాట్లాడుతున్న సరళమైన ఇంగ్లీష్ ని చూసినట్లయితే ప్రిన్సిపల్ వారితోపాటు ఉపాధ్యాయ బృందం దినదిన అభివృద్ధికి ఎంత కృషి చేస్తున్నారో చూస్తే అర్థమవుతుందని ఈ వార్షికోత్సవ సాంస్కృతి కార్యక్రమాలు చూస్తే తెలుస్తుందని అని అన్నారు.తల్లిదండ్రులు తమ కష్టానికి తగ్గ ఫలితాలను మా విద్యార్థులలో వారి ప్రతిభాపాటలలో చూపిస్తున్నామని అన్నారు సాధారణమైన విద్యార్థులతో అసాధారణమైన ఫలితాల సాధిస్తున్న సెయింట్ విల్ సెంట్ పల్లటి పాఠశాల యందు చేర్పించి రాబోయే తరానికి ఆదర్శవంతులుగా చూడవచ్చని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నామని అన్నారు. ప్రిన్సిపల్ అరుణ్ సాల్విన్ మాట్లాడుతూ నూతనంగా అభివృద్ధి చెందుతున్న మండలంలో ఎన్నో వరదలకు పాఠశాలను ఉన్నతమైన ఫలితాలతో ముందుకు తీసుకెళ్తున్నామని తల్లిదండ్రులకు ఈ సభ ముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఉపాధ్యాయుల చొరవ తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఉన్నంతకాలం ఈ పాఠశాల ఎన్నో అద్భుతాలకు నిలయంగా అద్భుత ఫలితాలకు నిలయంగా ఉంటుందని చెప్పారు ఏ పాఠశాలలో లేనటువంటి విద్యా విధానాలు అత్యుత్తమైన విద్య ప్రాటవాలను చెబుతూ విద్యార్థులను ఎన్నో అత్యున్నతమైన స్థాయిలకు తీసుకుపోవడంలో మా ఉపాధ్యాయులు కృషి ఎంతో ఉందని తెలియజేశారు ఇట్టి కార్యక్రమానికి పల్లోటి సెక్రటరీ షిమీల అదేవిధంగా కానక మాత స్కూల్ ఫౌండర్ పసల లార్డ్, మండల విద్యాశాఖ అధికారి నర్ర సబిత మరియు పసల అలెగ్జాండర్ జూలియన్ పోలిశెట్టి తిప్పబాతిని బాలిశెట్టి అడ్డగూడూరు ఎస్సై డి నాగరాజు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ జడ్పిటిసి కోఆప్షన్ నెంబర్ మాదాని ఆంథోని గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.