గూడెం గ్రామంలో అంగారంగా వైభవంగా సీతారాముల కళ్యాణం

06-04-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో
అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం.
ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకుని చిన్నంబాయి మండలం గూడెం గ్రామంలో ని శ్రీ సీతారాముల స్వామి ఆలయ సన్నిధిలో ఘనంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణం మహోత్సవం.
ఇట్టి కార్యక్రమంలో ముందుగా సీతారాముల గుడి దగ్గర హోమం నిర్వహించారు, ఈ యొక్క హోమం లో గుమ్మడం భవ్య శ్రీ & గుమ్మడం విష్ణుకుమార్ దంపతులు, మరియు డాక్టర్ లక్ష్మాజీ & యశోద భాయ్ దంపతులు, అదేవిధంగా గుమ్మడం పార్వతమ్మ, పోతులపల్లి ఈశ్వరమ్మ, పోతులపల్లి సంయుక్త, గుంటి శాంతమ్మ పాల్గొన్నారు.
ఈ యొక్క హోమం కార్యక్రమం తదన అనంతరం గుడి లోపట నుండి భాజా భజంత్రీలుతో సీతారాములవారిని కళ్యాణ మండపంలోకి తీసుకురావడం జరిగింది.
తదన అనంతరం లక్ష్మోజి & యశోద బాయిలు కల్యాణాన్ని నిర్వహించారు.
ఆ తర్వాత గుమ్మడం పార్వతమ్మ & గుమ్మడం సత్యనారాయణ దంపతులు,
పోతులపల్లి సంయుక్త& పోతులపల్లి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించి, భోజనం తాంబూలాలను స్వీకరించుకుని వెళ్లారు.
ఇట్టి కార్యక్రమంలో గ్రామ దేవాదాయ కమిటీ అధ్యక్షులు క్యాతోరి రాముడు, సింగోటం బాలస్వామి, తోట బాలకృష్ణ, పెద్దగాలెన్న, పూజారి నాగయ్య చారి ముందుండి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కి మహిళలు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేసి వారి యొక్క కోరికలను తీర్చుకున్నారు.