గురుకుల పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
అడ్డగూడూరు 08 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని మంగమ్మగూడెం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా గురుకుల విద్యార్థినిలు మహిళల ఔనత్యాన్ని చాటే మన మనుగడలో మహిళల స్థానాన్ని గుర్తించే విధంగా ఐదవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థినిలు(ఎస్సే రైటింగ్)వ్యాసరచన పోటీని నిర్వహించడం జరిగింది. అనంతరం విద్యార్థినీలచే సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు ,స్కిట్ ,డ్యాన్సులు ప్రదర్శించడం జరిగింది. అనంతరం పాఠశాల/ కళాశాల ప్రిన్సిపాల్ విజీనా చౌదరి మాట్లాడుతూ..అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా చైతన్యానికి ,స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీక సరోజినీ నాయుడు అని అన్నారు. అందువల్లనే భారత దేశంలో జాతీయ మహిళా దినోత్సవం 'నైటింగేల్ ఆఫ్ ఇండియా' భారత కోకిల' సరోజినీ నాయుడు అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లత , జూనియర్ ప్రిన్సిపాల్ ప్రసన్న లక్ష్మి ,మహిళా ఉపాధ్యాయినీలు, ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు