గుజరాత్ లో వంతెన పై ఘోర ప్రమాదం నిర్మాణ భద్రతపై ప్రశ్నలు

Jul 26, 2026 - 07:45
Jul 26, 2026 - 20:14
 0  1
గుజరాత్ లో వంతెన పై ఘోర ప్రమాదం నిర్మాణ భద్రతపై ప్రశ్నలు

గుజరాత్‌లో వంతెనపై ఘోర ప్రమాదం… నిర్మాణ భద్రతపై ప్రశ్నలు

గుజరాత్‌ లోని మాహి నది వంతెనపై జరిగిన ప్రమాదం వంతెనల భద్రత, రక్షణ వ్యవస్థలపై చర్చకు దారితీసింది. వేగంగా వచ్చిన ఒక భారీ ట్రక్ రక్షణ రైలింగ్‌ను ఢీకొట్టడంతో, డ్రైవర్ క్యాబిన్ భాగం వంతెన అంచు దాటి గాల్లో వేలాడుతూ కనిపించింది. అదృష్టవశాత్తూ డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు సమాచారం.

ఈ ఘటన నేపథ్యంలో, వంతెనలపై ఏర్పాటు చేసే రక్షణ రైలింగ్‌లు భారీ వాణిజ్య వాహనాల ఢీకొట్టడాన్ని తట్టుకునేలా ఉన్నాయా? నిర్మాణ ప్రమాణాలు, భద్రతా చర్యలు తగిన స్థాయిలో అమలవుతున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉన్నప్పటికీ, వంతెనల నిర్మాణ నాణ్యత, రక్షణ వ్యవస్థలు, భద్రతా ప్రమాణాలపై సమగ్ర సాంకేతిక పరిశీలన నిర్వహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. డ్రైవర్ ప్రాణాలతో బయటపడటం ఈ ఘటనలో ఊరటనిచ్చే అంశంగా నిలిచింది.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State