గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డుకు వెంటనే విధివిధానాలు రూపొందించాలి..

Mar 25, 2026 - 19:08
 0  0
గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డుకు వెంటనే విధివిధానాలు రూపొందించాలి..
గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డుకు వెంటనే విధివిధానాలు రూపొందించాలి..

AIRTWF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్...

 తెలంగాణ ప్లాట్ ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ బిల్లు -2026 ను స్వాగతిస్తున్నామని, వెంటనే బోర్డు విధివిధానాలు రూపొందించాలి AIRTWF తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ తెలిపారు. ఈరోజు ఖమ్మం జిల్లాలోని గిగ్ వర్కర్ల సమావేశం AIRTWF జిల్లా అధ్యక్షుడు వై.విక్రమ్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా పుప్పాల శ్రీకాంత్ మాట్లాడుతూ లక్షలాది మంది గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది అని. ఈ చట్టం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువాలంటే బిల్లులోని కొన్ని నిబంధనలపై మరింత స్పష్టత అవసరమని అన్నారు. ఈ  అసెంబ్లీలో చర్చించి, గిగ్ వర్కర్ల తో పాటు మెత్తం రావాణా రంగ కార్మికులకు ఉపయోగపడేలా సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు.

గిగ్ వర్కర్లకు కనీస వేతన చట్టం 1948 కంటే తక్కువగా ఉండకూడదన్నారు. పని స్వభావం, నైపుణ్యం ఆధారంగా వేతన వర్గీకరణ ఉండాలని, అప్పుడే గిగ్ కార్మికులకు నిజమైన ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సవరణలను పరిశీలించి కార్మికుల హక్కులను పటిష్టం చేసే విధంగా తుది చట్టాన్ని రూపొందించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు బిల్లులోని సెక్షన్ 2(ఎం)లో ఉన్న 'ప్లాట్ ఫామ్ వర్క్' నిర్వచ నం గందరగోళానికి దారితీసేలా ఉందని,దానిని తొలగించాలన్నారు. సంక్షేమ బోర్డు నిర్మాణంలో అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని,మహిళా గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం కనీసం ఒక మహిళా ప్రతినిధిని తప్పనిసరిగా నియమించాలని సూచించారు. బోర్డు పనితీరు లో పారదర్శకత కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం కావాలని, కనీసం 1/3 వంతు కోరం ఉండాలని తెలిపారు. అంతేకా కుండా చట్టం అమల్లోకి వచ్చిన 45 రోజుల్లోగా అగ్రిగేటర్లు తమ వద్ద ఉన్న గిగ్ వర్కర్ల డేటాను బోర్డుకు సమర్పించేలా నిబంధన ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో AIRTWF కేంద్ర కమిటీ సభ్యులు,ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ఉపేందర్ , యూనియన్ నాయకులు మోహన్, సైదులు, సందీప్, వీరన్న, సతీష్, అశ్రఫ్, తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333