గద్వాలలో భరోసా కేంద్రం అవగాహన – లింగ సమానత్వం, బాల్య వివాహాల నిర్మూలనపై స్పష్టమైన సందేశం

May 1, 2026 - 18:30
 0  16
గద్వాలలో భరోసా కేంద్రం అవగాహన – లింగ సమానత్వం, బాల్య వివాహాల నిర్మూలనపై స్పష్టమైన సందేశం
గద్వాలలో భరోసా కేంద్రం అవగాహన – లింగ సమానత్వం, బాల్య వివాహాల నిర్మూలనపై స్పష్టమైన సందేశం

జోగుళాంబ గద్వాల 1 మే 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల్. జిల్లాలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో భరోసా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమం ప్రభావవంతంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల  ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ధరూర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించి,  సమాజానికి అవసరమైన కీలక చట్టాలపై వివరించారు. ముఖ్యంగా చిన్నారులపై లైంగిక నేరాలను నిరోధించే POCSO చట్టం, ఉద్యోగ ప్రదేశాల్లో మహిళలపై వేధింపులను అరికట్టే POSH చట్టం గురించి సులభంగా అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులను సంప్రదించాలని, చిన్నారుల రక్షణ కోసం 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌ను వినియోగించాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్త అవసరమని, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని, ఆన్‌లైన్ మోసాలు ఎదురైతే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని హెచ్చరించారు.

లింగ సమానత్వం సమాజ అభివృద్ధికి పునాది అని, మహిళలు–పురుషులు సమాన అవకాశాలు పొందేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, ఇవి చిన్నారుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని వివరించి, అలాంటి ఘటనలు తెలిసిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో చట్టాలపై అవగాహన పెంచి, సురక్షితమైన మరియు సమానత్వం కలిగిన సమాజ నిర్మాణానికి భరోసా కేంద్రం కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భరోసా ఎస్సై తారక, కోఆర్డినేటర్ శివాని మరియు సిబ్బంది, గ్రామ సర్పంచ్ , పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. 

...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333