గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ ఇద్దరిపై కేసు నమోదు

Apr 8, 2025 - 19:37
Apr 8, 2025 - 19:38
 0  3
గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ ఇద్దరిపై కేసు నమోదు

సూర్యాపేట పట్టణంలో ని ఈనాడు ఆఫీస్ వద్ద వి. ప్రవీణ్ కుమార్ ఎస్‌ ఐ వారి సిబ్బంది తో కలిసి తేదీ 07-04-2025 వాహనాలను తనిఖీ చేస్తుండగా, అక్కడకు సాయంత్రం 5:30 గంటల సమయమున ఇద్దరు వ్యక్తులు ఒక పల్సర్ మోటారుసైకిల్ (దానికి ఎలాంటి నెంబర్ లేదు) గల దానిపై శాంతి నగర్ వైపు నుండి సూర్యాపేట పట్టణము లోపలికి వస్తుండగా , వారి వద్ద 1 కే‌జి 20 గ్రాముల.గంజాయి దొరికింది వారి పేర్లు తెలుసుకొనగా . గాజుల పేతురు @ గాజుల ప్రవీణ్ @ సోను తండ్రి సుధాకర్, వయసు: 21 సం,,రాలు, కులము: మాల, వృత్తి: ఫోటోగ్రాఫి, నివాసము: స్నేహానగర్, కుడకుడ గ్రామము, చివ్వెంల మండలము, అని 2. బానొత్ మహేష్ నాయక్ @ బానొత్ మహేష్ తండ్రి నర్సింహా, వయసు: 22 సం,,రాలు, కులము: లంబడ, వృత్తి: విధ్యార్తి, నివాసము: మున్యానాయిక్ తండా, చివ్వెంల మండలము.వీరు ఆంధ్రప్రదేష్ రాష్ట్రములోని విశాఖపట్నము దగ్గరగల అరకు ప్రాంతము వెళ్ళి, గంజాయిని కొనుక్కొని, అట్టి గంజాయిని సూర్యాపేటకు తీసుకవచ్చి, సూర్యాపేట, పరిసర ప్రాంతములలో అమ్ముతుండేవారు ఇట్టి నేరస్తులను పట్టుబడి చేసి రిమాండ్ కి పంపనైనది ఇట్టి కేసు. ఇట్లు పి. వీర రాఘవులు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సూర్యపేట పట్టణ పోలీస్ స్టేషన్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333