ఖరీఫ్ పంటలో కూడా యూరియా యాప్ ను వినియోగించుకోవాలి

Apr 11, 2026 - 06:57
Apr 11, 2026 - 06:57
 0  12
ఖరీఫ్ పంటలో కూడా యూరియా యాప్ ను వినియోగించుకోవాలి

అడ్డగూడూరు 10 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎరువుల సరఫరాను పారదర్శకంగా, అమలు సమర్థవంతంగా నిర్వహించేందుకు "యూరియా బుకింగ్ యాప్" ద్వారా యూరియా పంపిణీ కొనసాగుతోంది.గత యాసంగి సీజన్‌లో జిల్లాలో  యూరియా బస్తాల పంపిణీ యాప్ ద్వారా ప్రారంభించబడినది.  రాబోయే ఖరీఫ్ 2026 సీజన్‌లో కూడా ఈ యాప్ ద్వారా యూరియా పంపిణీ కొనసాగించబడుతుంది. ఈ నేపథ్యంలో రైతులు తమ మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించబడింది. మొబైల్ నంబర్ మార్పు కోరుకునే రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)ను సంప్రదించి తమ మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకోవచ్చు.జిల్లాలో పనిచేస్తున్న అందరూ ఏ డి ఏలు, ఎం ఏ ఓలు మరియు ఏఈఓలు రైతులకు విస్తృత ప్రచారం నిర్వహించి, 20-04-2026 లోపు వారి పరిధిలో ఉన్న  రైతుల మొబైల్ నంబర్ అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించడమైనది.రైతులు యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువులు పొందాలంటే, ప్రస్తుత మొబైల్ నంబర్ తప్పనిసరిగా యూరియా యాప్ లో నమోదు  అయి ఉండాలి. మొబైల్ నంబర్ అప్డేషన్‌కు చివరి తేదీ 20-04-2026 గా నిర్ణయించబడింది. కాబట్టి, అందరూ రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, తమ మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవలసిందిగా కోరడమైనది. పివి రమణా రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు