ఉపాధి హామీ కూలి మహిళను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

Apr 11, 2026 - 00:22
Apr 11, 2026 - 00:23
 0  5
ఉపాధి హామీ కూలి మహిళను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

అడ్డగూడూరు 10 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గట్టసింగారం గ్రామానికి చెందిన ఉపాధి హామీ తాత్కాలికంగా ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఈదుల రమేష్ తండ్రి బిక్షం అను వ్యక్తి ఉపాధి హామీలో పనిచేయడానికి వచ్చే మహిళను అసభ్యకరంగా వేధిస్తూ..లైంగిక కోరిక తీర్చమని వెంటపడుతూ లేనిచో పనిలో ఆటంకం కల్పిస్తానని,గతంలో ఆమెతో మాట్లాడిన వాట్స్అప్ వీడియో కాలింగ్ ని బయట పెడతానని బెదిరిస్తూ..గురువారం రోజున ఆ మహిళతో గతంలో వీడియో కాల్ మాట్లాడిన స్క్రీన్ షాట్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, వాట్సప్ డీపీగా పెట్టినట్లు అట్టి విషయంపై ఆ మహిళ ఫిర్యాదు మేరకు అడ్డగూడూరు ఎస్సై వెంకట్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.