క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందినప్పుడే వికసిప్ భారత్ లక్ష్యం నెరవేరుతుంది

Mar 10, 2024 - 20:58
Mar 11, 2024 - 13:02
 0  11
క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందినప్పుడే వికసిప్ భారత్ లక్ష్యం నెరవేరుతుంది
సామాజిక కార్యకర్త సీనియర్ జర్నలిస్ట్ గంధం సైదులు

మునగాల 10 మార్చి 2024  తెలంగాణవార్త ప్రతినిధి:- పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు పేదలకు అందినప్పుడే వికసిప్ భారత్  లక్ష్యం నెరవేరుతుందని సామాజిక కార్యకర్త సీనియర్ జర్నలిస్టు గంధం సైదులు అన్నారు. ఆదివారం ప్రధానమంత్రి వికసిప్ సంపర్క్ కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ఉద్దేశాన్ని, సూచనలు సందేశ రూపంలో పంపాలని దీనిని నేరుగా ప్రధానమంత్రి చూస్తారని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మెసేజ్ వచ్చింది. ఈ సందర్భంగా సూచన తెలియజేస్తూ పేదల కోసం చేస్తున్న ప్రజాహిత సంక్షేమ పథకాలు హర్షణయం. ఆచరణలో కేంద్రం అందించే పథకాలలో బ్యాంకర్లు ఇతర సంస్థలు నుంచి ఇబ్బందులు లేకుండా ప్రతి దరఖాస్తు చేసుకున్న పేదవాడికి సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వ శాఖల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలి. ఎంతోమంది నిరుపేదలు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు తెలియక వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని అన్నారు. ఫలితంగా పేదవారు పేదవారి లాగే ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్షేత్రస్థాయిలో ఈ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించి ధనిక వర్గాలకు పథకాలు వర్తించకుండా పేద, మధ్యతరగతి వారికి నేరుగా అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామస్థాయిలో రాజకీయ నాయకులు ఈ పథకాలను వారి అనుచరులు, బంధువులకు వర్తింప చేసుకుంటున్నారని.. పారదర్శకంగా క్షేత్రస్థాయిలో నిజమైన పేదలకు అందించే విధంగా చర్యలు తీసుకున్నప్పుడే ఈ దేశం కలలుగన్న వికసిత భారత్ సాధ్యమవుతుందని అన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రవేశపెట్టే పథకాలు ప్రచార లోపంతో నిర్వీర్యమై పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తన అభిప్రాయాన్ని స్వీకరించి పేదోడికి పథకాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తన అభిప్రాయం అడగడం కృతజ్ఞతలు తెలుపుకుంటూన్నాను.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State