క్రీడలకు గత కేసిఆర్ గారి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది...

Jan 15, 2025 - 19:55
 0  4
క్రీడలకు గత కేసిఆర్ గారి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది...

సంక్రాంతి పర్వదిన సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డా.ఆంజనేయులు గౌడ్ గారు,జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు గారు క్రీడా పోటీల నిర్వహణ వల్ల గ్రామాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతాయని డా.ఆంజనేయులు గౌడ్,బాసు హనుమంతు నాయుడు అన్నారు...గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం తాటికుంట,కుర్తిరావుల్ చెరువు గ్రామంలో యూత్ అధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రిమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయులు గౌడ్ గారితో కలిసి హాజరయ్యారు.... అనంతరం,ముఖ్య అతిథులను కమిటీ సభ్యులు,మరియు క్రీడాకారులు శాలువాతో ఘనంగా సత్కరించారు... అంతకుముందు,అతిధులను బిఆర్ఎస్ పార్టీ నాయకులు క్రీడాకారులు,యువత ఘన స్వాగతం పలికారు...ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఇలాంటి క్రీడా పోటీల నిర్వహణ వల్ల యువకుల మధ్య స్నేహబంధం పెరగడంతో పాటు ఆటల పట్ల పట్టుదల పెరుగుతోందని అన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడలు ప్రతి ఒక్క క్రీడాకారులు చక్కటి ప్రదర్శన ఇచ్చి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మీ ప్రదర్శనలు తీయాలని,భవిష్యత్తులో ఇలా రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి గద్వాల ప్రాంతానికి కూడా మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు.విద్యతో పాటు క్రీడ నైపుణ్యత పొంది క్రీడా రంగంలో కూడా రాణించాలి అని కోరారు.క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే,ఓడిపోయినా నిరుత్సాహం పడకూడదు,గెలిచాము అని గర్వపడవద్దు అని అన్నారు. స్నేహపూర్వకంగా క్రీడలను ఆడి, ఓడిపోయినా ఓటమి వజయానికి నాందిగా భావించాలని పేర్కొన్నారు.... గత కేసీఆర్ గారి  ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు... ఈ కార్యక్రమంలో మల్దకల్ మండలం బిఆర్ఎస్ పార్టీ నాయకులు డి.శేఖర్ నాయుడు,రామకృష్ణ ముదిరాజ్,ఎస్.రాము నాయుడు, బొప్పల్ శ్రీనివాస్,తిమ్మప్ప గౌడ్,రాయాపురం వీరెష్,వీరేష్ గౌడ్,వెంకటన్న,పుణ్య మూర్తి, మధు గౌడ్, రాములు, లక్ష్మన్న, బడ్డేన్న, శ్రీను,మోహన్ గౌడ్, రామకృష్ణ, గట్టన్నా, సురేష్,ఐజ చిన్న,సమేలు,వినోద్ కుమార్,నరసింహులు,వెంకటేష్,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333