కోటమర్తి గ్రామంలో విద్యుత్ షాక్ తో గేదె మృతి

అడ్డగూడూరు 03 మే 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో చేన్నబోయిన ప్రహ్లాద తండ్రి మల్లయ్య అనే రైతు పాడిగేద మేత కోసమని పొలంలో మేత మేసుకుంటూ పోయి విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన సంఘటన కోటమర్తి గ్రామంలో చోటుచేసుకుంది.విషయం తెలుసుకున్న రైతు గేదె మృతి పట్ల రైతు లబోధిబోని కన్నీరు మునీర్ అయ్యారు.ఇప్పటికే మండలంలోని వివిధ గ్రామాల్లో మూడు గేదెల ప్రాణాలు పోయినట్లు తెలుస్తుంది.కొంత మేరకు విద్యుత్ అధికారుల,పొలం యజమానుల నిర్లక్ష్యంగా కొన్ని మూగ జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయని స్థానికులు అన్నారు.గేదె సుమారు 80 వేలు విలువ ఉంటుందని అన్నారు. ఎలాగైనా ప్రభుత్వ నుండి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు రైతులు కోరారు.