కోటమర్తి గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరం

Aug 25, 2026 - 19:38
Aug 25, 2026 - 19:39
 0  1
కోటమర్తి గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరం

అడ్డగూడూరు 25 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో పీహెచ్‌సీ అడ్డగూడూరు ఆధ్వర్యంలో మంగళవారం రోజు టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పి.విష్ణువర్ధన్ రావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డా"బి.భార్గవి వైద్యాధికారి,శారద, పీహెచ్‌ఎన్,సరోజన, ఎంపీహెచ్‌ఎస్(ఎఫ్) ఎంపీహెచ్‌ఏ(ఎఫ్)ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఎన్‌టీఈపీ సిబ్బంది మరియు ఎయిమ్స్ బీబీనగర్ బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.టీబీ నిర్మూలనలో భాగంగా ప్రజలకు క్షయవ్యాధిపై అవగాహన కల్పించడం,అనుమానితులను గుర్తించడం,అవసరమైన పరీక్షలు నిర్వహించడం వంటి కార్యక్రమాలను శిబిరంలో చేపట్టారు.ఈ కార్యక్రమానికి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.