కోటమర్తి అంగన్వాడీలో పోషణ పక్షం కార్యక్రమం 

Apr 21, 2025 - 20:52
 0  34
కోటమర్తి అంగన్వాడీలో పోషణ పక్షం కార్యక్రమం 

అడ్డగూడూరు 21 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధి కోటమర్తి గ్రామంలో అంగనవాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమంలో సూపర్వైజర్ మధురమ్మ పాల్గొన్నారు. అనంతరం సూపర్వైజర్ మాట్లాడుతూ.. చిరుధాన్యాలు పౌష్టిక మైన ఆహారం తీసుకున్నట్లయితే పిల్లల ఎదుగుదల మానసిక స్థితిగతులు సరిగ్గా ఉంటాయని తెలియజేశారు.పోషణ పక్షం రోజులు ఎంతో కీలకమన్నారు. పోషణ అభియాన్ పోషణ  పక్వాడ పోషణ పక్షంలో స్త్రీలు చిరుధాన్యాలు మాంసకృతులు లభించే ధాన్యాలు ఆకుకూరలు పండ్లు గుడ్లు మాంసాహారాలను స్వీకరించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి,దాస్లీమ్  అంగన్వాడి టీచర్లు. షమీం సుల్తానా. భాగ్యలక్ష్మి. సంధ్య మరియు బాలింతలు గర్భిణీలు స్త్రీలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333