కొత్త బస్టాండ్ ముందు పైప్ లైన్ లీకేజ్ మరమ్మత్తులు చేసి - రోడ్డు బాగు చేయడం మరిచిన మున్సిపల్ సిబ్బంది

Aug 13, 2026 - 20:04
 0  1
కొత్త బస్టాండ్ ముందు పైప్ లైన్ లీకేజ్ మరమ్మత్తులు చేసి - రోడ్డు బాగు చేయడం మరిచిన మున్సిపల్ సిబ్బంది
కొత్త బస్టాండ్ ముందు పైప్ లైన్ లీకేజ్ మరమ్మత్తులు చేసి - రోడ్డు బాగు చేయడం మరిచిన మున్సిపల్ సిబ్బంది

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

 జోగులాంబ గద్వాల 13 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల. పురపాలక సంఘం కొత్త బస్టాండ్ సమీపంలో గత మూడు రోజులుగా వాటర్ లీకేజ్ కారణంతో మున్సిపల్ సిబ్బంది బుధవారం నాటికి మరమ్మత్తులు పూర్తి చేశారు. కానీ రోడ్డును బాగు చేయడం మాత్రం మరిచారు.  మరమ్మత్తులు చేసి నామమాత్రంగా రోడ్డును బాగు చెయ్యకుండగా వదిలిపెట్టడంతో భారీ వాహనాలు వెళ్లడంతో పెద్దపెద్ద గుంతలు పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు.కొత్త బస్టాండ్ ముందు వన్వే కావడంతో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాకు తెలిపారు.  మున్సిపల్ అధికారుల స్పందించి రోడ్డును బాగు చేసి ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండగా చూడాలని కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333