కొండా సురేఖ కూతురు సుస్మితా కామెంట్స్

Sep 6, 2026 - 21:33
 0  1
కొండా సురేఖ కూతురు సుస్మితా కామెంట్స్

మా అమ్మ ఏం తప్పు చేసిందని ఇంత అవమానించారు ?

అమ్మా, నాన్నా నన్ను క్షమించండి.. కన్నీళ్లు పెట్టుకుంటూ భోరున ఏడ్చిన కొండా సుష్మిత.....

పార్టీలో నేనైనా ఉండాలి, ఆమె అయినా ఉండాలి అనే స్థాయికి ఒక ముఖ్యమంత్రి దిగజారుతాడా ?

నేను మాట్లాడిన మాటల్లో తప్పులేదని ఇప్పటికీ చెప్తున్నాను......

ఒకవేళ తప్పు ఉన్నా కూడా, నా తప్పు కాబట్టి నామీద అక్రమ కేసు పెట్టి నన్ను జైల్లో వేయాల్సింది......

ఒక సామాన్య కార్యకర్త నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన మహిళపై రేవంత్ రెడ్డి ఇంత పగ పెట్టుకుంటాడని అనుకోలేదు......

నేను పార్టీని ఎక్కడ కించపరచలేదు.. కేవలం ఒక వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడాను......

మా అమ్మ చేసిన ఒక్క తప్పు చూపించండి.. తన శాఖలో చిన్న అవినీతి కూడా జరగలేదు.....

సో-కాల్డ్ రేవంత్ మీడియా కావాలనే మా అమ్మ స్థాయిని తగ్గిస్తున్నారు......

ఒక ఆడబిడ్డ ఉసురు ఊరికే పోదు....

సహచర మంత్రిగా ఉన్న మా అమ్మ రేవంత్ ను తిట్టమని ఎందుకు చెప్తుంది ?

ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్న మా నాన్న రేవంత్ రెడ్డిని తిట్టమని ఎందుకు చెప్తాడు ?

అధిష్టానం మొత్తం మా అమ్మకే మద్దతుగా ఉంది.. కానీ రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేయడం వల్లనే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది......

రేవంత్ రెడ్డి సోదరుల అక్రమాల చిట్టా ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడతా.......

మా అమ్మ, నాన్న కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు.......

మా అమ్మను ఇంత అవమానిస్తారని తెలిస్తే అలా మాట్లాడేదాన్ని కాదు......

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333