కేజీబీవీ రాజోలి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

Jul 23, 2026 - 20:50
Jul 23, 2026 - 20:55
 0  1
కేజీబీవీ రాజోలి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
కేజీబీవీ రాజోలి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

జోగులాంబ గద్వాల 23 జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండల కేంద్రంలో గురువారం రాజోలిలోని కేజీబీవీ పాఠశాలను అయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న విద్యా, వసతి, భోజన సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, భోజనశాల, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం తదితర అంశాలను సమీక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని, ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యూనిఫామ్, బెడ్ షీట్స్ అందజేశారు. ఈ తనిఖీలో పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State