కేజీబీవీ జూనియర్ కళాశాల గట్టులో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం..!

May 1, 2025 - 19:46
May 1, 2025 - 20:26
 0  33
కేజీబీవీ జూనియర్ కళాశాల గట్టులో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం..!

జోగులాంబ గద్వాల 1 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గట్టు . మండల కేంద్రంలోని కేజీబీవీ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపిసి గ్రూపులలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ గుంటి గోపిలత తెలియజేశారు.తెలుగు మీడియంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 40సీట్లు, బైపిసి గ్రూపులో 40సీట్లు కలవు.10వ తరగతి పాసైన బాలికలు మాత్రమే అర్హులు.దరఖాస్తు నింపిన ఫారం కళాశాల దగ్గరే ఇవ్వాలని, దరఖాస్తుతో పాటు 10వ తరగతి ఆన్లైన్ మెమో,పాస్ పోర్ట్ సైజ్ ఫోటో,ఆధార్,బోనఫైడ్, కుల మరియు ఆదాయ ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులను జతపరచవలసిందిగా సూచిస్తూ ,సూచించిన డాక్యుమెంట్స్ జతపరచనిచో దరఖాస్తు తిరస్కరించబడునని ప్రిన్సిపాల్ తెలియజేశారు .మరిన్ని వివరాలకై సంప్రదించాల్సిన నెంబరు 8008530209.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333