కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన* హామీలను నిలబెట్టుకోవాలి

Mar 8, 2026 - 16:44
 0  1
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన* హామీలను నిలబెట్టుకోవాలి

 జోగులాంబ గద్వాల 8 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బహుజన రాజ్య సమితి, ప్రజా సంఘాల JAC ఆధ్వర్యంలో గద్వాల పట్టణం స్థానిక TJS కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన వాదులు, హక్కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ మహిళలకు కూడా రాజ్యాంగ పరంగా అన్ని రంగాలలో సమాన హక్కులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. అలాగే బేటీపడావో, బెటీబచావో అన్న ప్రధాన మంత్రి మహిళలకు వెంటనే బహుజన మహిళల రిజర్వేషన్ కోటాతో  పాటు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. మహిళలందరికీ సమాన విద్యా అవకాశాలను, ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే విద్యను అభ్యసించిన మహిళలకు సరియైన ఉపాధి అవకాశాలను అందించాలని, సరియైన రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందుగా మహిళా రైతులకు, కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అగ్రవర్ణ ఆధిపత్యం, ఆధిపత్య పెట్టుబడిదారీ కంపెనీల దోపిడి, పీడనలు పెరిగి సమన్వయం దెబ్బతిని గందరగోళం ఏర్పడిన వేళ, వారికి సమాన రాజ్యాధికార వాటాలను రాజ్యాంగ హక్కుగా కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కువ నిధులు విడుదల చేసి అన్ని అవకాశాలను ఏర్పరచాలి.రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు Md సుబాన్, మరియు బహుజన రాజ్య సమితి నాయకులు M. వాల్మీకి,k. వినోద్ కుమార్, కుర్మన్న,TPF జిల్లా అధ్యక్షుడు నాగన్న, బహుజన నాయకుడు ఉప్పేరు సుభాన్ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333