కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేసిన జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

Apr 16, 2025 - 19:40
 0  15
కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేసిన జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

జోగులాంబ గద్వాల 16 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. కులాంతర వివాహం చేసుకున్న జంటకు సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని తన ఛాంబర్ నందు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతిని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ మంజూరు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. గద్వాల పట్టణానికి చెందిన శ్రీమతి టి.యం. మౌనిక (వైఫ్ ఆఫ్  కె.రమేష్ ) ఎస్సీ కులాంతర వివాహం చేసుకున్నందుకు, ప్రభుత్వ కల్పించిన పథకం ద్వారా 2,50,000 ప్రోత్సాహక బహుమతిని మంజూరైనట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో జంటకు బాండ్‌ను అందజేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సరోజ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333