కులమత బేధాలు లేకుండా ఏకదంతా గణపతి ఉత్సవాలు

Sep 15, 2024 - 21:45
Sep 15, 2024 - 22:08
 0  2
కులమత బేధాలు లేకుండా ఏకదంతా గణపతి  ఉత్సవాలు

15-09-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

 చిన్నంబావి పలు మండలాలలోకులమతాలకు అతీతంగా గణేష్ ఉత్సవాలు.

గుమ్మడం గ్రామంలో ముస్లిం యువకుడు గణపతి పూజలకు సహకారం

కుల మతాలకు అతీతంగా ముస్లిం యువకుడు గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పూజ సామగ్రి అందించడం పట్ల పలువురు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంనికి చెందిన మహమ్మద్ అంజద్ హుస్సేన్ కులమతులకతీతంగా గణేష్ నవరాత్రుల ఉత్సవాలకు సహకారం అందించారు.

హిందువులే కాదని ముస్లిమ్స్ కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించవచ్చని సాటి చెప్తున్నాడు. తాను నివాసం ఉంటున్న 2వ వార్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పూజలు ఘనంగా నిర్వహించడం విశేషం.

గణేష్ నిమాజనం సందర్భంగా అంజద్ మాట్లాడుతూ దేవుడు అందరకి ఒకటేనని అందుకే ప్రతి ఒక్కరి మనోభావాలను తాను గౌరవిస్తానని హిందూ ముస్లిం భాయ్ భాయ్ గా ఉండాలని అందుకే హిందువులు నిర్వహించే పండుగలను కూడా తాను సహకరిస్తాను అని తెలిపారు.

గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించిన భక్తులకు శాలువలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వార్డు పెద్దలు ముస్లిం సోదరులు అధిక మొత్తంలో పాల్గొని నిమజ్జనం కార్యక్రమాన్ని  విజయవంతంగా నిర్వహించారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State