కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న జూపల్లి
18-05-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన మ్మాయిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుని కుటుంబానికి సహాయం అందజేసిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు.
చిన్నంబావి మండలం అమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త బచ్చలకూర చిన్నారాముడు గత కొన్ని రోజుల క్రితం మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని అగ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రికి విన్నవించడంతో
నేడు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు పంపిన 20000/-(ఇరవై వెల రూపాయలు) ను బచ్చలకూర చిన్నరాయుడు గారి భార్య బచ్చలకూర దేవమ్మ కు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగ బిచుపల్లి యాదవ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి అందజేశారు.
మరియు అదే గ్రామంలో అనారోగ్యంతో బాధ పడుతున్న బచ్చలకూర లక్ష్మయ్య గారిని జూపల్లి అనుచరులు పరామర్శించారు.
ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు బీచుపల్లి యాదవ్ గారితో పాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.