కానూరి తాత ఆశయాల కోసం పోరాడుదాం.
ఏం.డేవిడ్ కుమార్ సీపీఐ (ఏం_ఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకుడు కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు తన కళ రూపాలు,రచనల ద్వారా అసమానతల వ్యవస్థ మార్పు కోసం పోరాడి అమరత్వం పొందిన అయిన ఆశయాల కోసం పోరాడాలని సీపీఐ (ఏం _ఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం. డేవిడ్ కుమార్ అన్నారు.
ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రం నందు కానూరి వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈకార్యక్రమంలో ఐ ఎఫ్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, ఐ ఎఫ్ టీ యు జిల్లా ఉపాధ్యక్షులు కూనుకుంట్ల సైదులు, ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు, ఐ ఎఫ్ టి యు జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి,అరుణోదయ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లె వెంకన్న,పార్టీ టౌన్ నాయకులు అశోక్ రెడ్డి,దండి ప్రవీణ్,శ్రీధర్,హుస్సేన్, కోడూరు సోమన్న,తదితరులు పాల్గొన్నారు.