కాక్రోజ్‌లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం–కేంద్ర ప్రభుత్వ వైఖరి సరైనది కాదు!!!
బొడ్డు కిరణ్ బిఎస్పీ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి
శాలిగౌరారం 22 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత 22 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసులు దాడి చేయడం,లాఠీచార్జ్ చేయడం,ర్యాలీని అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఈ ఘటనను బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)తీవ్రంగా ఖండిస్తుంది అని బిఎస్పీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి బొడ్డు కిరణ్ అన్నారు.విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం, వారిపై పోలీసు బలప్రయోగానికి పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.ప్రజాస్వామ్యంలో శాంతి యుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఇది దారుణం అని బొడ్డు కిరణ్ అన్నారు.నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయినప్పటికీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుండా, ఆందోళన చేస్తున్న విద్యార్థులను అణచివేయాలని చూడటం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం.విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం బీజేపీ ప్రభుత్వానికి తగదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలి.నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై నిష్పాక్షిక విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి.అలాగే నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కేంద్ర ప్రభుత్వం వైఖరిని సరికాదని బొడ్డు కిరణ్ విమర్శించారు.