కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు అస్వస్థత
కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత రావు అస్వస్థతకు గురయ్యారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఖైరతాబాద్లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం 78ఏళ్ల వయసు ఉన్న హనుమంతరావు గతంలోనూ పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. గతంలోనూ ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం కోలుకున్నారు. కాంగ్రెస్ లో దశాబ్దాల కాలం నుండి పనిచేస్తున్న ఆయన ఎప్పుడూ చురుగ్గా ఉంటూ కాంగ్రెస్ యువనేతల్లో జోష్ పెంచుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన అస్వస్థతకు గురవ్వడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.