కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా భూతం లింగయ్య యాదవ్

May 8, 2026 - 20:50
 0  1
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా భూతం లింగయ్య యాదవ్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా భూతం లింగయ్య యాదవ్ ఆత్మకూర్ ఎస్.... కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా మండల పరిధిలోని కందగట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భూతం లింగయ్య యాదవ్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం భూతం లింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిదంగా తనపై నమ్మకం ఉంచి తన ఎన్నికకు సహకరించిన డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నరసయ్యకు, మండల పార్టీ అధ్యక్షులు కందాల వెంకటరెడ్డికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్ది సుధాకర్ రెడ్డి, కందాల రాంరెడ్డి, శివ శ్రీనివాస్ గౌడ్, గోగుల సత్తిరెడ్డి, భూతం రాములు మూల ఎల్లయ్య, బోరింగ్ తండ సర్పంచ్ బిచ్చు నాయక్, కేశవరెడ్డి, ముస్కు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.