కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
రాజీవ్ స్ఫూర్తితో దేశ సమగ్రతను కాపాడేందుకు పునరంకితమవుదాం
రాజీవ్ వల్లే దేశంలో సాంకేతిక విప్లవం
ఆయన కృషితోనే ఐటీ, టెలికాం రంగాల అభివృద్ధి
దేశ యువతకు రాజీవ్ ఒక స్ఫూర్తి
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సొజు నరేష్
తిరుమలగిరి 21 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదే అని ఎల్సొజు నరేష్ అన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని,భారత రత్న రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో రాజీవ్ విగ్రహం రాజీవ్ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్మా గాంధీ మాటలను రాజీవ్ నిజం చేశారన్నారు. “రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలకే సర్వ హక్కులు, అధికారాలు కల్పించారు రాజీవ్ గాంధీ. స్థానిక సంస్థలను బలోపేతం చేశారు.దేశంలో మహిళలకు స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి పేదల చేతిలో అధికారం పెట్టారు” అని అన్నారు. సాంకేతిక విప్లవం తీసుకు వచ్చింది రాజీవ్ గాంధీ అని ఆయన గుర్తు చేశారు. “ఐటీ రంగంలోనే కాదు, టెలికాం రంగంలోనే సమూల మార్పులు తెచ్చి మారుమూల పల్లెలకు చేర్చారు. దేశంలో యువకులకు రాజీవ్ ఒక స్పూర్తినిచ్చారు. దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం. ఆయన జయంతి సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన సేవలను, ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
వారి స్పూర్తితో మళ్లీ దేశ సమగ్రతను కాపాడేందుకు పునరంకితమవుదాం” అని తెలిపారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్తి రాజయ్య మాజీ మార్కెట్ చైర్మన్ మూల అశోక్ రెడ్డి నియోజకవర్గ మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ హఫీజ్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ధరావత్ జుమీలాల్ మున్సిపల్ కౌన్సిలర్ మొగుల్లా జితేందర్ ఎస్టీ సెల్ చైర్మన్ ప్రేమ్ ప్రసాద్ ఎస్సీ చల్ చైర్మన్ బందేల్లి రవి ఐ ఎన్ టి యు సి చైర్మన్ పానుగంటి గణేష్ మండల కాంగ్రెస్ నాయకులు దుపాటి మల్లయ్య దాచేపల్లి వెంకన్న ధరావత్ రామోజీ దుప్పల్లి అబ్బాస్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ చింతకాయల సుధాకర్ గ్రామ శాఖ అధ్యక్షులు నాయిని కృష్ణ ఎల్లంల నాగరాజు గజ్జి లింగన్న బానోతు భాస్కర్ నాగేందర్ బూత్ ఇన్చార్జులు దొంతర బోయిన నరసింహ సేవాలాల్ చైర్మన్ బానోత్ రాముడు జంపాల బిక్షం గోపాల్ దాస్ రమేష్ ఏనుగుల వెంకన్న యువజన కాంగ్రెస్ నాయకులు బోండ్ల వంశీ పేరాల నరేష్ ఏనుగుల కొమర మల్లు మాసంపల్లి మోహన్ వేల్పుల వెంకన్న ఎర్ర నరేష్ యశ్వంత్ రషీద్ తదితరులు పాల్గొన్నారు