తిరుమలగిరి మున్సిపాలిటీలో నిద్రపోతున్న నిఘా
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం
తమ కళ్ల ఎదుట చీమ చిటుక్కుమన్నా పసికట్టే శక్తి నిఘానేత్రం
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో ఈ దుస్థితి
తెలంగాణ చౌరస్తా లో పనిచేయని సీసీ కెమెరాలు
నిర్వహణ లోపం.. గత నాలుగేళ్లుగా పనిచేయని వైనం
పెరుగుతున్న క్రైమ్, దొంగతనాలు అక్రమ రవాణా
పట్టించుకోని అధికారులు.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు
తిరుమలగిరి 21 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులు పెట్టు తమ కళ్ళ ఎదుట చీమ చిటుకుమన్న పసికట్టే శక్తి వాటి సొంతం వాటి కంటి చూపుల్లోంచి ఏ ఒక్క నేరస్థుడు తప్పించుకోలేడు పోలీసులు పెట్రోలింగ్ చేయకపోయినా అవి మాత్రం 24/7 పెట్రోలింగ్ చేస్తూనే ఉంటాయి అలాంటి సీసీ కెమెరాలు నిర్వహణపై అధికారులు పోలీసులు శ్రద్ధ ఊహించకపోవడంతో నిందితులు పోలీసులకు ఆలస్యంగా చిక్కుతున్నారు సూర్యాపేట జనగాం తొర్రూరు హైదరాబాద్ ప్రధాన రహదారిపై సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రం ఉంది తిరుమలగిరి మున్సిపల్ తెలంగాణ చౌరస్తా వద్ద గతంలో నాలుగు కూడలిలో నాలుగు కెమెరాలు బిగించారు తర్వాత వాటి నిర్వహణపై అశ్రద్ధ వహిస్తున్నారు తిరుమలగిరి లో రోజుకు వేలకొద్ది జనం తమ అవసరాల నిమిత్తం వస్తుంటారు బస్టాండ్ సెంటర్లో పలు దుకాణాల్లో సీసీ కెమెరా ఉన్న ప్రాంతంలోని ఫ్యాన్సీ దుకాణంలో ఫర్నిచర్ దుకాణంలో గతంలో ఓ బంగారు షాప్ లో చోరీకి గురైనది బైక్ మెకానిక్ దుకాణంలో మోటార్ ఎత్తుకెళ్లారు పార్కింగ్ లో పెట్టిన వాహనాల టైర్లు మరియు బ్యాటరీలు అపహరించారు ఇంకా పలు చిన్నాచితక్క దొంగతనాలు జరిగాయి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అజాంతకులు తమ పనులు యదేచంగా కానిచ్చేస్తున్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాలో తిరుమలగిరి మున్సిపాలిటీ సరిహద్దును ఆనుకుని ఉంది అంతరాష్ట్ర రహదారిపై తిరుమలగిరి మండలం నుండి ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు మహారాష్ట్ర భద్రాచలం జనగాం సిద్దిపేట్ హైదరాబాద్ ఖమ్మం వైపు వెళుతుంటాయి ఈ కేంద్రంలో సీసీ కెమెరాలు పనిచేయక పలు కేసుల్లో పోలీసులకు ఇబ్బందిగా మారింది గతంలో కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు గ తేడాది మరమ్మతులకు గురికాగా ఇప్పటికీ ఏర్పాటు చేయడంలో ఆలస్యం చేస్తున్నారు కెమెరాలు ఉన్న పని చేయని పరిస్థితి నెలకొంది నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ప్రయాణ ప్రాంగణంలో నేలకొరిగి నిద్రపోతున్నాయి
నేర నియంత్రణ నిఘ నేల చూపులు
రోజురోజుకీ పెరిగిపోతున్న నేరాల పట్ల పోలీసులు పౌరుల్ని అప్రమత్తం చేయడానికి నిఘా నేత్రాలున్నాయి. అన్నింటా పోలీసులు వుండలేరు కాబట్టి సీసీ టీవీల ద్వారా నేరగాళ్ళు ఆగడాలకు చెక్ పెట్టే పని సీసీ కెమెరాలు చేస్తున్నాయి. ఈవ్ టీజర్ల, ఆకతాయిలా దుమ్ముదులిపే మూడో కన్ను.. సీసీటీవీలు గంటల వ్యవధిలోనే నేరస్థులను కటకటాల పాలుచేస్తున్నాయి. కేసుల చేధనలో అండగా నిలుస్తున్నాయి. మంచి సత్పలితాలు ఇస్తుండడంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఈ నిఘా నేత్రాలను అమర్చారు. నేర నియంత్రణే లక్ష్యంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ పోలీసులు ముందుకెళ్తున్నారు. అలాంటి నిఘా నేత్రాలు నేడు నిద్రపోతున్నాయి.
అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా చోరీలు
సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో అసాంఘిక కార్యకలాపాలకు మరియు గంజాయి సేవిస్తున్న వారికి నిలయంగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి ఎనిమిది గంటల దాటితే పలు రైతుబజార్ల ఆవరణలలో మందుబాబులు యథేచ్ఛగా మద్యం సేవిస్తున్నారని, అంతేకాకుండా గంజాయి చేస్తూ ఆకతాయిల ఆగడాలను తట్టుకోలేక విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే చోరీలు కూడా పెరిగాయి. తిరుమలగిరి మున్సిపల్ కేంద్రానికి వచ్చే పలువురు వినియోగదారుల సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులు అపహరణకు గురవుతున్నాయి. దీనిపై నిత్యం సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగల ఆచూకీ తెలుసుకోలేని దుస్థితి నెలకొంది.
ఇక్కడినుండే ఎక్కడికైనా...
సూర్యాపేట జిల్లా లో రెండవదిగా పేరుగాంచిన తిరుమలగిరి మున్సిపల్ కేంద్రం వ్యవసాయం వ్యాపారం వాణిజ్యపరంగా ప్రముఖమైనది ఇక్కడ ప్రధాన వీధిలో పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అటు జిల్లాలకు ఇటు నియోజకవర్గాలకు అనుసంధానమై మధ్యలో కూడలిగా ఉన్న తిరుమలగిరి మున్సిపల్ కేంద్రం. నేరస్తులు ఎవరైనా ఏ జిల్లాకు ఏ మండలానికి వెళ్లాలైనా తిరుమలగిరి మున్సిపల్ నుండే వెళ్లగలరు అలాంటి తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో నిఘా నేత్రాలు నిద్రపోవడం జరుగుతుంది
నిర్వహణ లోపం.. పట్టించుకోని అధికారులు
సీసీ కెమెరాల నిర్వహణ లోపం.. మార్కెటింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ చౌరస్తా వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ ప్రజా ప్రతినిధులు అధికారులు పోలీసు యంత్రాంగం ఎవరు పట్టించుకునే నాధుడే లేక దీంతో సీసీ కెమెరాలు మూలనపడ్డాయి.
ప్రజల రక్షణ కోసం ఇప్పటికైనా స్పందించండి అధికారులారా...
మండలంలోని , తిరుమలగిరి పాత ఊరు తొండ వెలిశాల అనంతరం ప్రగతి నగర్ గ్రామానికి నిఘా కరువైంది. గ్రామంలో ప్రజల శ్రేయస్సు, భద్రత దృష్ట్యా తదితర ప్రదేశాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. కొన్ని ప్రదేశాల్లో అమర్చిన సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడం వల్ల గ్రామంలో ఏదైనా ప్రమాదాలకు ఎవరైనా కారణం ఐన వాటిని గుర్తించలేకపోతున్నారు. సీసీ కెమెరాల నిఘా క్లియర్ గా ఉంటే బాధితులకు అండగా నిలవొచ్చు . ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు, చైన్ స్నాచింగ్ కేసులను వెంటనే ఛేదించడానికి ఆస్కారం వుంటుంది. గ్రామాల్లో మంచి వాతావరణం ఉండేలా చర్యలు కొత్త టెక్నాలజీని వినియోగించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. భద్రత ఉన్నచోటే అభివృద్ధి ఉంటుందని అంటున్నారు. ఉన్న కెమెరాలను పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.