కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు పేరూరు పంచాయతీ నుండి భారీ చేరికలు
తెలంగాణ వార్త వాజేడు: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు పంచాయతీలోని బిజెపి టిఆర్ఎస్ పార్టీల నుండి పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కోరం పగిడయ్యడ బిజెపి నాయకుడు ఆత్మకూరి ప్రవీణ్ ఆత్మకూరి రాఘవ రాజు గొబ్బూరి రఘుపతి కుర్సం రాంబాబు తునూరి జయరాజు లకు కాంగ్రెస్ పార్టీములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పలు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దంతులూరి విశ్వనాథ ప్రసాదరాజు కాంగ్రెస్ పార్టీ వాజేడు మండల మాజీ అధ్యక్షులు దాట్ల సీతారామరాజు సొసైటీ ఉపాధ్యక్షులు వత్సవాయి జగన్నాథరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే కాజావలి కాకర్లపూడి కళ్యాణ్ నల్లగాసి రమేష్ కురుసం కృష్ణమూర్తి బంధం కృష్ణ వెంకటేశ్వర్లు