కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా ఎమ్మెల్యే
ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అండగా ఉంటా శాసనసభ్యులు మందుల సామెల్ వెల్లడి.
నూతన మండల అధ్యక్షులు కార్యకర్తలకు అండగా ఉంటారు.
తుంగతుర్తి 07 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- తుంగతుర్తి మండల పరిధిలోని శాసనసభ్యులు మందుల సామెల్ వసతి గృహంలో ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీనిఅభివృద్ధి చేసిన కార్యకర్తలు సీనియర్ నాయకులు అనే గ్రామాల నాయకులతో కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండే వారికి నూతన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులను నియమించడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలోని ప్రతి పేదవానికి మన పార్టీ ఇస్తున్న పథకాలను తెలియపరుస్తూ వారిని చైతన్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పేదవారికి కల్పిస్తున్న ఇందిరమ్మ ఇల్లు వారికి చెందే విధంగా ప్రతి గ్రామంలో పేదవారికి ఇచ్చే సౌకర్యాలను చేస్తూ ఇంకా గ్రామాలలో వారికి కావలసిన సేవలను అందిస్తూ అన్ని పథకాలు మన పార్టీ కార్యకర్తలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పని చేసిన ప్రతి నాయకుని కార్యకర్తను మీరు కలుపుకొని పనులు చేయాలని నూతన మండల అధ్యక్షులకు క్షుణ్ణంగా తెలిపారు.
పార్టీ అధిష్టానం సలహాలు సూచనల మేరకు నేను ప్రతి మండలంలో నూతన మండల అధ్యక్షులను పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు ఇచ్చినాను నేను ఎలాంటి స్వార్థం కోసం చేయలేదని ఆయన నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నేను ప్రతి మండలంలోని గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానన్నారు. కొంతమంది నాపై పడని వారు మాయమాటలు చెబుతూ కొన్ని మండలాలలో నాకు వ్యతిరేకంగాప్రచారం చేస్తూ పార్టీని బ్రష్టు పట్టిస్తున్నారు అని ఆయనఅన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రేగటి రవి గౌడ్ మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు పలు మండలాల మండల అధ్యక్షులు సర్పంచులు మాజీ సర్పంచులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.