కల్వర్టుకు ఢీకొని ఇద్దరు యువకులు మృతి
నాగారం 24 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టుకు ఢీకొని మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం కేంద్రంలో చోటు చేసుకుంది వివరాలకు వెళితే గంగిడి విష్ణు( 21) గ్రామం గన్నారం మండలం రాయపర్తి వరంగల్ జిల్లా వాసి మరియు గంగారబోయిన అరవింద్ (20) గోపాలపురం గ్రామం మండలం మహబూబాద్ చెందిన యువకులు స్నేహ కోళ్ల ఫారం లో సూపర్వైజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు అయితే రాత్రి 11 గంటల సమయంలో ఇరువురు వ్యక్తులు తమ బైక్ Tg 06 u 4909 పై నాగారం మండలం లక్ష్మాపురం గ్రామ శివారులోని కోళ్ల ఫారం కి వెళ్లి తిరిగి తిరుమలగిరి వస్తుండగా గోపాలపురం గ్రామ శివారు వద్దకు రాగానే వారు నడిపే బైకు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టుకు ఢీకొట్టడంతో రోడ్డు పక్కన పడిపోయారు వెంటనే అటుగా వెళుతున్న వారు 108 అంబులెన్స్ లో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఇద్దరు యువకులు మరణించారు విషయం తెలుసుకున్న బ్రాంచ్ మేనేజర్ జిల్లెల్ల క్రాంతి రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు