కడెం రమేష్&విజయ కుమారిల 25వ వివాహ వార్షికోత్సవ వేడుక

Apr 16, 2025 - 19:36
 0  32
కడెం రమేష్&విజయ కుమారిల 25వ వివాహ వార్షికోత్సవ వేడుక

శాలిగౌరారం15ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలో చిత్తలూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు కడెం లింగయ్య&లింగమ్మ ఆరవ సంతానం చిన్న కొడుకు కోడలు కడెం రమేష్ పోటీ పరీక్షల నిపుణులు తెలంగాణ ఉద్యమ చరిత్ర బోధిస్తూ అనేకమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు సాదించడంలో కీలక పాత్ర పోషించారు.తన జీవిత భాగస్వామి విజయ కుమారి కూడా కళాశాలలో లెక్చరర్ బోధిస్తూ అనేక మందికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.ఈ సందర్భంగా తన పూర్వ విద్యార్థులు,తన సహచర అధ్యాపకులు,మిత్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో అభినందనలు తెలియజేస్తూ...వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అలాగే ప్రజా ప్రతినిధులునాగారం జడ్పిటిసి  కడెం పరమేశ్వర్,గ్రామ పెద్దలు పలువురు నాయకులు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చేస్తూ పుష్పగుచ్చాలు అందజేస్తున్నారు.వారి ఐదుగురు అన్నలు & వదినలు,అక్క మేన అల్లుళ్లు,కూతుళ్లు అల్లుళ్లు కొడుకులు బిడ్డలు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారి బామ్మర్ది కుంభజడ వీరబాబు&ఝాన్సీ మాట్లాడుతూ..వారి యొక్క అన్యోన్య దాంపత్యం, ఆదర్శనీయమైనది, ఆచరణీయమైనది,ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని వారిద్దరి కుమారులను అత్యంత ఉన్న తమైటువంటి చదువులు చెప్పించి ఒక ఇంజనీరింగ్ మరొకరు డాక్టర్ గా స్థిరపడ్డారు.అని కడెం బ్రదర్స్ కి తెలియపరిచారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333