క(కా)లం ఎప్పుడు కదులుతుంది
మైనింగ్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అధికారి కవి..కడెం ధనంజయ
అడ్డగూడూరు 24 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– కాలముతో పాటు కలం ఎప్పుడు కదులుతుంది,ముందుకు సాగుతుంది,ఎన్నో సమస్యలకు పరిష్కారమార్గన్ని చూపెడుతుంది.మెదడు చంచలమై పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది.వాతావరణ,పర్యావరణ,ప్రకృతిపై,పలు రకాల విధానాలను రూపొందిస్తుంది,తెలియచేస్తుంది సమాజపుపోకడలను,రుగ్మతులను,ప్రేమ,మంచిని,మానవత్వాన్ని విశ్లేషణ చేస్తు ప్రజల ముందు ఉంచుతుంది,పరిష్కారం వెతుకుతుంది.కలానికి,కాలానికి అనుబంధం ఎంతో ఉంది, ఎప్పుడు సంఘములో జరిగే మార్పులను బాగుకొరకు, బలపడడానికి సహాయ పడుతుంది,ప్రశ్నిస్తుంది, అవసరమైతే ఎదురు తిరుగుతుంది విధ్వంసం సృష్టిస్తుంది కలం పోరాడుతుంది కాలంతో పోటీపడుతుంది తాజ సమాచారముపై తగు రీతిలో స్పందిస్తు ఎందరినో మేలుకొలుపుతుంది త్యాగనికి సిద్దపడుతుంది అయితే,కాలముతొ కలబడలేము కాని,కలాన్ని ముందుంచి,ప్రచారం కలిపించి ప్రజా చైతన్యాన్ని,అన్ని ఆంశాలపై అవగాహనతొ ముందుకెళ్లడం విజయం సాధించడం చరిత్ర చెప్పె సత్యం,అదె కలానికి,కాలానికి ఉన్న గొప్పతనం...రచన.కడెం. ధనంజయ మైనింగ్ రిటైర్డ్ అధికారి గ్రామం చిత్తలూర్ మండలం శాలిగౌరారం నల్గొండ జిల్లా