ఒకేసారి రెండు నవలలు, ఓ సినిమా యువ సెన్సేషన్ గణేష్

Apr 24, 2026 - 10:11
Apr 24, 2026 - 15:58
 0  118
ఒకేసారి రెండు నవలలు, ఓ సినిమా  యువ సెన్సేషన్ గణేష్

 తిరుమలగిరి 24 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన యువ రచయిత గణేష్ తన సృజనాత్మక ఆలోచనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒకేసారి “ప్రేమ .. జీవితాంతం మోసిన ఒక వ్యక్తి కథ అనే శీర్షికతో” మరియు “డిజిటల్ లవ్” నవలలతో పాఠకుల ముందుకు రానున్నారు.ఇప్పటికే సినీ రంగం వైపు తన అడుగులు వేస్తున్న ఆయన, తన రచన-దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. చిన్న కుగ్రామం నుంచి పెద్ద కలలతో ముందుకు వస్తున్న గణేష్, సాహిత్యం మరియు సినిమాల్లో ఒకేసారి తన ముద్ర వేయబోతున్న యువ కెరటం గా నిలుస్తున్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి