ఐజ మున్సిపాలిటీ పరిధిలో బేడ బుడగ జంగాల కాలనీ లో అక్కడ ఉన్న ప్రజలు మురికి నీరు కాలువల వ్యవస్థ గురవుతున్నారు
ఇంటి ముందర ఒక రోడ్డు లేదు
5 ఐదు వరుసలు మట్టి రోడ్డు లైన్లో ఉన్న అక్కడ ఒక్క ఒక లైను కూడా డ్రైనేజీలు కాలువలు లేవు.
ఆ కాలనీలో చాలా సమస్యలు ఉన్న పట్టించుకునే నాధుడు లేడు అంటూ అక్కడ ఉన్న ప్రజలు వాపోతున్నారు.
ఇలా చూస్తూ చూస్తూ ఇంకేమీ అనక అలాగే ప్రజలు అలాగే ఉండిపోయారు.
జోగులాంబ గద్వాల 24 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఐజ ఈరోజు పెద్ద సమస్య వచ్చి ఎదురుపడింది మురికినీరు వాటర్ ఎక్కడ పోకుండా ప్రజల ఇండ్ల ముందర డైరెక్ట్ గా గుడిసె బండ అంచున వాటర్ తడుచుకుంటూ ఇండ్లలోకి చిన్నగా వాటర్ వస్తున్నాయని అక్కడ ఉన్న ప్రజలు పెద్దలు ఈరోజు ఉదయం నుంచి ఇలా ఉంటే ఎలా మేము ఎలా ఉండాలి మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మా బతుకులు మారావా మమ్మల్ని పట్టించుకునే అధికారులు లేరా ఈరోజు బేడ బుడగజంగా కాలనీలో ప్రజలు అవస్థ గా గురవుతున్నారు. దీని గురించి వెంటనే మున్సిపాలిటీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మా కాలనీకి ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం బేడ బుడగ జంగాల కాలనీ వాసులు.