ఐకానిక్ వంతెన కోసం ఢిల్లీ పెద్దలను కలిసిన ఎల్లేని సుధాకర్ రావు

Jul 24, 2026 - 18:19
Jul 24, 2026 - 21:45
 0  3
ఐకానిక్ వంతెన కోసం ఢిల్లీ పెద్దలను కలిసిన ఎల్లేని సుధాకర్ రావు

24-07-2026 తెలంగాణ వార్త ప్రతినిధి.ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికై పట్టు వదలని విక్రమార్కుడులా 3 రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఎల్లేని చర్చలు.

మొన్న NHAI అధికారులతో భేటీ అయిన సుధాకర్ రావు గారు నేటి ఉదయం కేంద్ర రోడ్డు రవాణా&జాతీయ రహదారుల శాఖ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరి గారిని కలిశారు.

జాతీయ రహదారితో కూడిన ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయి రాకపోకలు ప్రారంభమైతే కొల్లాపూర్ రూపురేఖలు మారుతాయని అందుకు మీరే స్వయంగా చొరువ తీసువాలని మంత్రి గారిని కోరిన ఎల్లేని సుధాకర్ రావు.

దానికి మంత్రి గారు స్పందిస్తూ సుధాకర్ జీ మీ కొల్లాపూర్ ప్రజలకు ఇచ్చిన ప్రామిస్ ను నేను నిలబెట్టుకుంటా..ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఉన్న చిన్న చిన్న అడ్డంకులను అన్నింటిని క్లియర్ చేసి త్వరగా బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు మంత్రి.

అలాగే వెలటూరు-గుందిమళ్ళ బ్యారేజ్ నిర్మాణంతో పాటు మరొక జాతీయ రహదారి ప్రతిపాదన కూడ మంత్రి గారి ముందు పెట్టగా దానికి మంత్రి గారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

కొల్లాపూర్ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వ పెద్దల స్పందన వారి నిబద్దత నిజంగా సంతోషాన్ని కలిగిస్తుందని ఈ సందర్బంగా తెలియజేశారు ఎల్లేని సుధాకర్ రావు.

కొల్లాపూర్ ప్రజల ఆశీర్వాదం ఉంటే ఇంకా ఎన్ని ప్రాజెక్టులైనా సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు ఎల్లేనిసుధాకర్ రావు.

 

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State