ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించాలి

Jul 22, 2026 - 19:59
 0  2
ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించాలి

విద్యార్థులకు టీవీ సౌకర్యం కల్పించాలి

 దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి హాస్టల్ సీటు కల్పించాలి.

బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

 జోగులాంబ గద్వాల 22 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల.  జిల్లా కేంద్రంలోని ఎస్సీ సోషల్ వెల్ఫేర్ అధికారి ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ....
* ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టళ్లలో నెలకొన్న వివిధ సమస్యలను తక్షణమే పరిష్కరించి, హాస్టల్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హ విద్యార్థికి సీటు కేటాయించేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

* ప్రతి విద్యా సంవత్సరం హాస్టల్ సీట్ల కొరత కారణంగా పేద, గ్రామీణ మరియు వెనుకబడిన కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ప్రభుత్వ విద్యను అభ్యసించే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం అత్యంత అవసరమని, అందువల్ల దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హ విద్యార్థికి హాస్టల్‌లో సీటు కేటాయించాలని కోరారు.

* అలాగే హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వసతి గదులు, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్, భద్రత, ఆరోగ్య సదుపాయాలు, అవసరమైన ఫర్నిచర్, పడకలు, అధ్యయనానికి అనుకూలమైన వాతావరణం వంటి మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు.

* విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికారులు సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించి, ఒక్క అర్హ విద్యార్థి కూడా సీటు లేక ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

* ప్రతి ఎస్సీ హాస్టల్ లో టీవీ సౌకర్యాన్ని కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో స్వామి, నటరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333