ఎల్ ఆర్ఎస్ ఆన్లైన్ సమస్యలను పరిష్కరించాలి

Mar 18, 2025 - 15:16
Mar 18, 2025 - 15:31
 0  18
ఎల్ ఆర్ఎస్ ఆన్లైన్ సమస్యలను పరిష్కరించాలి
ఎల్ ఆర్ఎస్ ఆన్లైన్ సమస్యలను పరిష్కరించాలి

చివరి తేదీని మరో మూడు* *నెలలు* *పొడిగించాలి.*

రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

(సూర్యాపేట టౌన్,మార్చి 18)

ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం తెచ్చిన ఆన్లైన్ లో సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయం నుండి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించేందుకు మున్సిపాలిటీ కార్యాలయాలకు వెళ్తే పేమెంట్ చేసిన ఆన్లైన్లో ప్రాసెస్ అని చూపుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అధికారులను అడిగితే సర్వర్ ప్రాబ్లం మూలంగా సమస్యలు తలెత్తుతున్నాయని చెప్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎల్ ఆర్ ఎస్ చేసుకుంటేనే రిజిస్ట్రేషన్ అవుతుందని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అధికారులు చెబుతుండగా ఎల్ ఆర్ ఎస్ ఫీజు చెల్లించినప్పటికీ ఆన్లైన్లో మాత్రం అండ ర్ ప్రాసెస్ అని సైట్ లో చూపుతుందన్నారు. ఈనెల 31 వరకు ఎల్ఆర్ఎస్ కు ప్రభుత్వం చివరి తేదీగా ప్రకటించిందని కానీ చివరి తేదీని మరో మూడు నెలల పాటు పొడగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2020 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లకు కూడా ఎల్ ఆర్ ఎస్ చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలని కోరారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సిబ్బందిని పెంచడంతోపాటు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి ఖమ్మం పార్టీ అంజయ్య గౌడ్ పట్టేటికిరణ్ పట్టణ గౌరవ సలహాదరుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి అయితే గాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ సారగాండ్ల కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333