ఎమ్మెల్యే, కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పశు సంవర్దక శాఖ అధికారి వెంకటనారాయణ

Jun 3, 2026 - 20:03
 0  0
ఎమ్మెల్యే, కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పశు సంవర్దక శాఖ అధికారి వెంకటనారాయణ

 జోగులాంబ గద్వాల  జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని వేరువేరుగా బుధవారం  జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జి. వెంకటనారాయణ పూల మొక్కను వారికి అందజేశారు. బదిలీపై జోగులాంబ గద్వాల జిల్లాకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జి. వెంకటనారాయణ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ని ఐ డి ఓ సి నందు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరం  గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి  డాక్టర్ జి. వెంకటనారాయణ. బదిలీపై జోగులాంబ గద్వాల జిల్లాకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించి పూల మొక్క బహూకరించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ జి. వెంకటనారాయణ మీరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా మంచి ప్రగతి సాధించాలని జిల్లాలోని పశుసంపదను పాడి పశువులను పెంపొందించేందుకు కృషి చేయాలని మీకు నా సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇస్తూ గతంలో ధరూరు, ములకలపల్లి లో డాక్టర్ గా పనిచేసినప్పుడు వారి పాత జ్ఞాపకాలను వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ  జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గా మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333