ఎమ్మార్పీఎస్ నిరసన దీక్షలో పాల్గొని సంఘీభావం
టీవీఎన్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు బాలెంల నరేందర్ మహారాజు

అడ్డగూడూరు 17 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సోమవారం రోజు స్థానిక అడ్డగుడూరు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చేపట్టిన దీక్షలో భాగంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శి సురారం రాజు మాదిగ,బాలెంల నరేష్ మాదిగ గార్ల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్ష కార్యక్రమానికి టి,వి,ఎన్,ఎస్ వ్యవస్థాపకుడు బాలెంల నరేందర్ సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు.సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ..మాదిగల జనాభా ప్రాతిపదికన ప్రకారం 11 శాతం రిజర్వేషన్ ఇయ్యాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఇంకో విషయాన్ని ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ మాదిగ ఉపకులాలను విభజించిన తర్వాతే గ్రూప్స్ ఫలితాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.తక్షణమే ఫలితాలను నిలుపుదల చేయాలని ఆవేదనా వ్యక్తం చేశారు.లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు సురారం రాజు,మండల ప్రధాన కార్యదర్శి బాలెంల నరేష్,అధికార ప్రతినిధి పనుమటి సతీష్,మాజీ మండల అధ్యక్షుడు గజ్జెల్లి రవి,అడ్డగుడూర్ మండల డప్పు కళాకారుల అధ్యక్షుడు బాలెంల డప్పు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.