ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో తుంగతుర్తి ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత

తిరుమలగిరి 01 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
కాలేజీ యాజమాన్యాలపై చార్యలు తీసుకోవాలి
విద్యార్థులకు అండగా నేనుంటా ఎమ్మెల్యే మందుల సామెల్
ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో రాకపోవడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాలేజీ యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి అని ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇట్టి విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థులకు సహకరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ తుంగతుర్తి నియోజకవర్గం అధ్యక్షుడు కొండగడుపుల ప్రవీణ్ కుమార్ మరియు తుంగతుర్తి నియోజకవర్గ ఎన్ ఎస్ యు ఐ నాయకులు పత్తెపురం రాఖి నాగరం మండలం కొండగడుపుల ముకేష్ జాజువల్ల సిద్దు కొండగడుపుల మహేష్ తుంగతుర్తి మండలం ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు