ఉమ్మడి నల్లగొండ జిల్లా మహాసభకు బయలుదేరిన ఎమ్మార్పీఎస్ నాయకుడు
మునగాల 04 నవంబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని నిండు అసెంబ్లీలో మాట్లాడి నేడు ఉద్యోగాల భర్తీ తో పాటు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ మరియు ఇతర నోటిఫికేషన్ లను జారీ చేస్తూ కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ మాదిగ,ఉపకులాల విద్యార్థి,నిరుద్యోగ యువతను మోసం చేయడాన్ని ఖండిస్తూనల్లగొండ జిల్లా కేంద్రంలో (జే.బీ.ఎస్) గార్డెన్ లో ముఖ్య అతిధులుగా మహాజన నేత మందకృష్ణ మాదిగ విచ్చేస్తున్న ఉమ్మడి జిల్లా సదస్సు కార్యక్రమానికి మునగాల మండల పరిధి నుండి పెద్ద ఎత్తున బయలుదేరిన,ఎం.ఎస్.పి. జిల్లా ప్రధానకార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ,
ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ, ఎం.ఎస్.పి మునగాల మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను మాదిగ,విజయరాఘపురంగ్రామశాఖఅధ్యక్షులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు మాదిగ, ఉపాధ్యక్షులు సోమపంగు వినోద్, ప్రధానకార్యదర్శి రెమిడాల రాజేష్, ప్రచారకార్యదర్శి రెమిడాల రవితేజ, కత్తి వేణు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రెమిడాల లింగయ్య, కత్తి కోటయ్య, బరాఖాత్ గూడెం, గ్రామ శాఖఅధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ, ఆకుపాముల ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖనాయకులు తాళ్లపాక వీరబాబు, తదితరులు వెళ్ళినారు.