ఉమ్మడి నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ రైతు మహా ధర్నాను విజయవంతం చేయాలి ఎస్.ఎ రజాక్

Jan 27, 2025 - 19:16
 0  13
ఉమ్మడి నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ రైతు మహా ధర్నాను విజయవంతం చేయాలి ఎస్.ఎ రజాక్

మద్దిరాల 27 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకుల సమావేశం నిర్వహించారు.ప్రెస్ మీట్లో మండల పార్టీ అధ్యక్షుడు ఎస్ ఏ, రజాక్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిందేమీ లేదు..అబద్ధాలు వాయిదాలతో ప్రజలను ప్రజలను మభ్యపెడుతూ సంక్షేమ పథకాలను ఎగ్గోడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం 28-01-2025 ఉదయం 10 గంటలకు ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్య నిర్వహణ అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు పాల్గొనే బిఆర్ఎస్ రైతు మహాధారణకు మండలాల్లోనే అన్ని గ్రామాల నుండి మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ అధ్యక్షులు కార్యదర్శులు ప్రాథమిక నాయకులు రైతులు పార్టీ కార్యకర్తలు నాయకులుఅధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరాంరెడ్డి మండల సర్పంచుల మాజీ అధ్యక్షులు కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి,కోడి శీను,జిలకర చంద్రమౌళి,వడ్డానం మధుసూదన్ కోతి సుధీర్ రెడ్డి, మారెల్లి యాకయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333