ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం

Nov 4, 2024 - 12:18
 0  29
ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం

అడ్డగూడూరు 04 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గోపాలమిత్ర సెంటర్లోని లక్ష్మీదేవికాల్వ గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజు పశుసంవర్ధక శాఖ సహకారంతో "ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం " నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో దీర్ఘకాలికంగా గర్భం దాల్చని పశువులను గుర్తించి తగిన చికిత్స చేయడం జరిగింది. ఎదలో ఉన్న వాటికి కృత్రిమ గర్భధారణ చేశారు. అదేవిధంగా చూడి పరీక్షలు చేయడం జరిగింది.దూడలకు నట్టల నివారణ మందులు వేయడం జరిగింది.అదేవిధంగా గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరిగింది.రైతులకు కృత్రిమ గర్భధారణ మరియు మేలు జాతి పాడి పశువులపై అవగాహన కల్పించడం జరిగింది.అదేవిధంగా విటమిన్ ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది.పాల దిగుబడిని పెంచే ఖనిజ లవణ మిశ్రమాలను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు విఎ ఎస్ అనిల్ రెడ్డి,విఎల్ వో శ్రీరాములు,విఏ ఈశ్వరయ్య, గోపాలమిత్ర సూపర్వైజర్  మర్రి మహేష్, గోపాల మిత్రులు రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333