ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పడాల్సిందే

Aug 16, 2026 - 18:56
 0  2
ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పడాల్సిందే

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సోనియా గాంధీ,మల్లి కార్జున్ ఖర్గే , రాహుల్ గాంధీ వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించకుండా అవమానించారంటూ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వైఎస్సార్ చౌక్  వద్ద  జిల్లా బిజెవైఎం  అధ్యక్షుడు బాబుల్ రెడ్డి  ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది..

ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా  జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు హాజరై  మాట్లాడుతూ..*

జాతీయ గేయాన్ని అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడమేనని, ఈ ఘటనపై కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర నాయకులు దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని రామాంజనేయులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్  ఎక్బోటే,శ్యామ్ రావ్, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ నరసింహ , బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు అనిల్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దాస్, కౌన్సిలర్ చంద్ర శేఖర్ ,మాజీ కౌన్సిలర్ శ్రీమన్నారాయణ,బీజేపీ సినీయర్  నాయకులు అక్బర్ బాషా, సద్ధల క్రిష్ణ,మధు గౌడ్,శంకర్, డిల్లీ వాలా క్రిష్ణ,తిమ్మన, బిజెవైఎం నాయకులు పాండు, సతీష్, మోహన్ రెడ్డి, పవన్ ,రమేష్,కిషోర్   కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333