ఇసుక డంపు సీజ్

తిరుమలగిరి 17 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. తిరుమలగిరి మండలంలోని ఈదుల పర్రె తండాలో అనుమతి లేకుండా అక్రమంగా నాలుగు ట్రిప్పుల ఇసుక డంపు నిల్వ ఉంచారు. ఈ విషయంపై తహసీల్దార్ బి హరి ప్రసాద్ కు సమాచారం అందించారు. బుధవారం తహసీల్దార్ ఆదేశాల మేరకు మండల అక్రమంగా నిల్వ ఉన్న ఇసుకను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గిర్ధవర్ తెలిపారు.