ఇంద్ర మా ఇల్లు ఎంపికలు వ్యవసాయ కార్మికులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి
పెన్ పహాడ్ మండల నవంబర్ 05 తెలంగాణ వార్త ప్రతినిధి:-ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో వ్యవసాయ కార్మికులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ వార్త నవంబర్5పెన్ పహాడ్ మండల కేంద్రంలో మంగళవారంనాడు ఆయన పెన్ పహాడ్ తహసిల్దారు కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం మాట్లాడుతూ.... గ్రామీణ ప్రాంతాల్లో కేవలం వ్యవసాయాన్ని నమ్ముకుని జీవించడానికి ఎలాంటి ఆధారాలు లేక కేవలం రెక్కలను మాత్రమే నమ్ముకుని దారిద్రరేఖకు దిగువన జీవిస్తున్న వ్యవసాయ కార్మికులకు ఇండ్లు లేక అనేక అవస్థలు పడుతున్నారని వారందరినీ గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని, అలాగే కుటుంబ సభ్యులందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందించాలని 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు నెలకు 5000 రూపాయలు పెన్షన్ అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పొట్టకూటి కోసం గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లిన వ్యవసాయ కార్మికులను గుర్తించి వారందరి కూడా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, 60 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు జాబు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి పెరుగుతున్న నిత్య జీవితావసర వస్తువుల ధరలుగమనంలో ఉంచుకొని రోజుకు 700 రూపాయల కూలీ అందించాలని ఆయన కోరారు వినతిపత్రం ఇచ్చిన వారిలో అఖిల భారత యువజన సమాఖ్య సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను, నరసయ్య జయంత్ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు