ఇందిరమ్మ ఇండ్లు పేదలకు పెద్ద అండ..ఎమ్మెల్యే మందుల సామేల్
అడ్డగూడూరు 26 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామంలో ఈదుల దుర్గమ్మ రాములు అదే మండలంలో కోటమర్తి గ్రామంలో మలిశెట్టి సోమలక్ష్మి సోమనారాయణ ఇందిరమ్మ ఇండ్లు నూతన గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు రిబ్బన్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొని అకుటుంబ సభ్యులకు పట్టు వస్త్రాలు పెట్టి వారిని ఆశీర్వదించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు పెద్ద అండగా ఉంటుందని అన్నారు.గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో పేదలకు ఉండడానికి ఇల్లు లేక ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామాన ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారునికి వారి కోరిక మేరకు అనుకూలంగా కట్టుకునే అవకాశం కల్పించిందని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి పేద ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహప్రవేశాలకు రిబ్బన్ కట్ చేసే అవకాశం ఇచ్చిన నా తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో గట్టుసింగారం గ్రామ సర్పంచ్ హౌసింగ్ ఏఈ గోపి సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాశం సత్యనారాయణ, వల్లభట్ల రవీందర్, జనార్ధన్,కోటమర్తి గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, పిసిసి రాష్ట్ర నాయకులు బాలెoలా సైదులు, మండల నాయకులు పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.